Bengaluru Rains: వీడియో ఇదిగో, బెంగుళూరులో వరదలకు బైకుతో సహా కొట్టుకుపోతున్న టెకీ, నగరాన్ని ముంచెత్తిన భారీ వరదలు, స్కూళ్లకు సెలవు.. ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోమ్

ఈ నేపథ్యంలో, వాతావరణ శాఖ తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులోని ఐటీ, బీటీ, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

Bengaluru Rains Video (Photo-X)

బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వాతావరణ శాఖ తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులోని ఐటీ, బీటీ, ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు,హైదరాబాద్‌లో ఉదయం నుండే భారీ వర్షం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, అక్టోబర్ 16న నగరంలోని అన్ని ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఉన్నత పాఠశాలలు మూసివేస్తారు.వాతావరణ శాఖ, బెంగళూరులో కురుస్తున్న వర్షాల కారణంగా రానున్న రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా, ముందుజాగ్రత్తగా స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. భారీ వరదలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ టెకి వరదలో కొట్టుకుపోవడం వీడియోలో చూడవచ్చు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)