Abhay Sandhu Dies of COVID-19: భగత్ సింగ్ తమ్ముడు కుమారుడు అభయ్ సింగ్ సంధు కరోనాతో కన్నుమూత, సంతాపం తెలిపిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్
అమరవీరుడు భగత్ సింగ్ తమ్ముడు కుమారుడు అభయ్ సింగ్ సంధు(63) కరోనాతో కన్నుమూశారు. కరోనా సోకిన అభయ్ సింగ్ సంధును మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
అమరవీరుడు భగత్ సింగ్ తమ్ముడు కుమారుడు అభయ్ సింగ్ సంధు(63) కరోనాతో కన్నుమూశారు. కరోనా సోకిన అభయ్ సింగ్ సంధును మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అభయ్ సింగ్ సంధు...భగత్ సింగ్ సోదరుడు సర్దార్ కుల్బీర్ సింగ్ కుమారుడు. అభయ్‌సింగ్ మృతికి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంతాపం తెలిపారు.
పంజాబ్ ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ కూడా అభయ్‌సింగ్ మృతికి సంతాపం వెలిబుచ్చారు. కాగా గత 24 గంటల్లో పంజాబ్‌లో కొత్తగా 8,068 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 8,446 మంది కరోనా నుంచి కోలుకోగా, 180 మంది మృతి చెందారు. ప్రస్తుతం పంజాబ్‌లో 79,359 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 11,477 మంది కరోనా కారణంగా కన్నుమూశారు.
Here's Punjab CM Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)