Nitish Kumar Covid: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు కరోనా, ఆయన నివాసంలో 11 మందికి కోవిడ్, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో బీహార్ ముఖ్యమంత్రి

బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా కరోనా బారినపడ్డారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిందని, వైద్యుల సలహా మేరకు ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారని సీఎంవో వెల్లడించింది.

Bihar CM Nitish Kumar (photo-ANI)

బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా కరోనా బారినపడ్డారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిందని, వైద్యుల సలహా మేరకు ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారని సీఎంవో వెల్లడించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని తెలిపింది. కాగా, గతవారం నితీశ్ కుమార్ నివాసంలో 11 మందికి కరోనా సోకింది. వారిలో ఆరుగురు సీఎం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగతావారు వంటవాళ్లు. గత మంగళవారం పలువురు మంత్రులు, ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement