Bihar: అర్థరాత్రి సమయంలో ఇంటిలో నిద్రిస్తున్న రైతులపై పోలీసులు దాడి, బక్సర్ రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగిన నిరసనకారులు, బీహార్ బక్సర్‌ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు

బీహార్‌లోని బక్సర్‌లో ఇంటిలో నిద్రిస్తున్న రైతులపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు విరుచుకుపడి విచక్షణరహితంగా కొట్టారంటూ స్థానికులు చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. ఆగ్రహావేశాలకు గురైన రైతులు పోలీసు వాహనాలను ధ్వంసం చేసి వాటికి నిప్పుపెట్టారు.

Cops Raid Home of Farmers Sleeping in Buxar (Photo-ANI)

బీహార్‌లోని బక్సర్‌లో ఇంటిలో నిద్రిస్తున్న రైతులపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు విరుచుకుపడి విచక్షణరహితంగా కొట్టారంటూ స్థానికులు చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. ఆగ్రహావేశాలకు గురైన రైతులు పోలీసు వాహనాలను ధ్వంసం చేసి వాటికి నిప్పుపెట్టారు.కాగా చౌస పవర్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని విద్యుత్ కంపెనీ సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ (ఎస్‌జెవిఎన్) సేకరించిన భూముల వ్యవహారంపై గత రెండు నెలలుగా రైతులు నిరసనలు చేస్తున్నారు.

కంపెనీ గేటు బయట రైతులు నిరసనలు సాగించడం వల్ల ప్లాంట్ పనులకు విఘాతం కలుగుతుంది. ఈ క్రమంలో నిరసనలు సాగిస్తున్న రైతులు ఉంటున్న ఇంటిపై మంగళవారం రాత్రి పోలీసులు విరుచుకుపడ్డారు. గ్రామంలోని ముగ్గురు యువకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.అర్థరాత్రి సమయంలో పోలీసులు జరిపిన దాడులకు ప్రతిగా స్థానికులు బక్సర్ రోడ్లపైకి వచ్చి బుధవారంనాడు ఆందోళనలకు దిగారు.ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం 2013లో అప్పటి ధరల ప్రకారం ఎస్‌జేవీఎన్ కంపెనీ రైతుల నుంచి భూసేకరణకు ఒప్పందం కుదిరింది. అయితే ప్రస్తుతం 2022 సంవత్సరం ధర ప్రకారం చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రైతులు నిరసనలు సాగుస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement