Bihar: లేటు వయసులో ఒక్కటైన దంపతులు, మహిళా న్యాయవాది నూతన్‌ను వివాహమాడిన న్యాయమూర్తి శివపాల్ సింగ్, సోషల్ మీడియాలో ఫోటోలు వీడియో వైరల్

దాణా కుంభకోణం కేసులో మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ శిక్ష విధించిన న్యాయమూర్తి శివపాల్ సింగ్ 59 ఏళ్ల వయస్సులో పెళ్లి కొడుకుగా మారారు. రిటైర్ కాబోతున్న వయస్సులో 50 ఏళ్ల మహిళా న్యాయవాదిని రెండో వివాహం చేసుకున్నారు.

Shiv Pal Singh, former special CBI judge and Nutan Tiwari. (Photo credits: Twitter/ Gujarat Samachar)

దాణా కుంభకోణం కేసులో మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ శిక్ష విధించిన న్యాయమూర్తి శివపాల్ సింగ్ 59 ఏళ్ల వయస్సులో పెళ్లి కొడుకుగా మారారు. రిటైర్ కాబోతున్న వయస్సులో 50 ఏళ్ల మహిళా న్యాయవాదిని రెండో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాకు చెందిన జడ్జ్ శివపాల్ సింగ్ పదవీ విరమణకు ఆరు నెలల ముందు రెండో వివాహం చేసుకున్నారు.తన స్నేహితురాలు, బీజేపీ నాయకురాలు అయిన 50 ఏళ్ల న్యాయవాది నూతన్ తివారీని శివపాల్ సింగ్ వివాహం చేసుకున్నారు.

వృత్తిరీత్యా లాయర్ అయిన నూతన్ భర్త 2006లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. న్యాయమూర్తి శివపాల్ భార్య 20ఏళ్ల క్రితమే మరణించారు. శివ్‌పాల్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. నూతన్‌కు ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే వీరు వివాహం చేసుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement