Teachers and Students Exchange Blows: కాలేజీలో చితక్కొట్టుకున్న టీచర్లు, విద్యార్థులు, కారణం ఏంటంటే..
బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో కాలేజీలో పరీక్షల నేపథ్యంలో టీచర్లు, విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ దాడిలో కొందరు విద్యార్థులు, ఒక స్టూడెంట్ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విద్యార్థులు ఆగ్రహించారు. కాలేజీ ప్రిన్సిపాల్, టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో కాలేజీలో పరీక్షల నేపథ్యంలో టీచర్లు, విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ దాడిలో కొందరు విద్యార్థులు, ఒక స్టూడెంట్ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విద్యార్థులు ఆగ్రహించారు. కాలేజీ ప్రిన్సిపాల్, టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఆర్‌జేడీ కాలేజీలో జరుగుతున్న పరీక్షలకు కొందరు విద్యార్థులు హాజరయ్యారు. సోదరుడి బదులు ఒక మహిళ బీఏ పార్ట్ 2 ఎగ్జామ్ రాసింది. టీచర్ వద్దకు వెళ్లి సంతకం చేయాలని అడిగింది. దీని గురించి వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఆగ్రహించిన ఆ టీచర్ ఆ తోబుట్టువులను కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఎగ్జామ్ హాల్ వద్దకు రాగా వారిని కూడా టీచర్లు కొట్టారు. ఆ కుటుంబంపై టీచర్లు దాడి చేయడంపై విద్యార్థులు ఆగ్రహంతో రగిలిపోయారు. వారు ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో టీచర్లు, విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ దాడిలో విద్యార్థులైన అభిషేక్ కుమార్, జనక్ నందనీ కుమారి, నిధి భారతి గాయపడ్డారు. అభిషేక్ తల్లి లక్ష్మీదేవి, సోదరుడు కరణ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Teachers and Students Exchange Blows
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)