JP Nadda COVID: జేపీ నడ్డాకు కరోనా, ఐసోలేషన్‌లో ఉన్నానని వెల్లడి, తనను కలిసినవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా సోకింది. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని నడ్డా వెల్లడించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. డాక్టర్ల సలహా మేరకు తాను ఐసోలేషన్ లో ఉన్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)