BJP: బీజేపీ కొత్త పార్లమెంట్ బోర్డు ప్రకటన, గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ లను తప్పించిన మోదీ, షా ద్వయం..
బీజేపీ పార్టీ తన కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
బీజేపీ పార్టీ తన కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇందులో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాతో సహా మరో 9 సభ్యులతో ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా బోర్డును ప్రకటించారు. ఈ బోర్డులో నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా, జేపీనడ్డా, బీఎస్ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జాఠియా, బీఎల్ సంతోష్‌ను సభ్యులుగా నియమించింది. అయితే పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ పేర్లను తొలగించారు. కానీ యడ్యూరప్ప, బీఎల్ సంతోష్‌లకు బీజేపీ పార్లమెంట్ బోర్డులో అవకాశం కల్పించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)