BMW Fire: బీఎండబ్ల్యూ కార్ల గోదాంలో ఘోర అగ్ని ప్రమాదం, 45 కార్లు అగ్నికి ఆహుతి, మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఎంఐడీసీ అగ్నిమాపక శాఖ అధికారులు

నవీ ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ (BMW) కార్ల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో 45 కార్లు (45 vehicles on fire) దగ్ధమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న ఎంఐడీసీ అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు

Algeria Wildfires Representational Image (Photo Credits: PTI)

నవీ ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ (BMW) కార్ల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో 45 కార్లు (45 vehicles on fire) దగ్ధమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న ఎంఐడీసీ అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నవీ ముంబైలోని తుర్భే ఎంఐడీసీలోని డీ-207 బీఎండబ్ల్యూ కార్ల గోదాంలో (BMW warehouse) ప్రమాదం చోటు చేసుకుందని, మంటల్లో 40 నుంచి 45 వాహనాలు దహనమయ్యాయని అధికారులు తెలిపారు. భారీగా మంటలు చెలరేగడంతో మంటలను ఆర్పేందుకు శ్రమించారు. 10 ఫైర్‌ టెండర్లు తరలించి దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎంత మేరకు నష్టం జరిగిందో తెలియరాలేదు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement