Tsuchinshan-ATLAS: ఈ నెల 28న ఆకాశంలో అద్భుతం, మళ్లీ భూమికి దగ్గరగా రానున్న దాదాపు 80 వేల సంవత్సరాల క్రితం కనిపించిన తోక చుక్క
ఈ నెల 28న ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. దాదాపు 80 వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చూసిన ఓ తోక చుక్క మళ్లీ నిపించనుందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు.అప్పట్లో సూర్యుడికి దగ్గరగా వచ్చిన ఈ తోకచుక్కను కామెట్ సి/2003 ఏ3 గా వ్యవహరిస్తున్నారు. శుచిన్ షాన్ - అట్లాస్ అని కూడా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ తోకచుక్క మరోసారి భూమికి దగ్గరగా రానుందని, శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్పారు.
అతి వాడకంతో చేజారిన పరిస్థితి.. యాంటీ బయోటిక్స్ పనిచేయని దుస్థితి.. ఐసీఎంఆర్ తాజా నివేదిక
ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా ఈ తోకచుక్కను ఎలాంటి పరికరాల అవసరం లేకుండానే నేరుగా మన కళ్లతో చూడొచ్చని తెలిపారు. బైనాక్యులర్ తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. మన జీవితకాలంలో అత్యంత అరుదుగా వచ్చే అద్భుతమని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ ఈ తోకచుక్కను వీడియో(టైమ్ లాప్స్ వీడియో)లో బంధించి పంపించాడు. ఈ నెల 28 న ఆకాశంలో కనువిందు చేసే ఈ తోకచుక్క అక్టోబర్ 10న కూడా కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)