Sabitha Indra Reddy on Konda Surekha Comments: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? అంటూ సూటి ప్రశ్న

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తప్పుబట్టారు. కేటీఆర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

File image of Minister Sabitha Indra Reddy | File Photo.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తప్పుబట్టారు. కేటీఆర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.సురేఖమ్మా, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది, కేటీఆర్ గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయమని పేర్కొన్నారు.

రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని, తిరిగి విమర్శించే ఆస్కారం ఇవ్వకూడదని. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలని, తద్వారా సమాజానికి ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు. మీరు చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ గారి అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించారా? అని కొండా సురేఖను ఉద్దేశించి ప్రశ్నించారు. బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడటం బాధాకరమన్నారు.

ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా? ఎక్స్ వేదికగా నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్

Here's Tweets

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement