Dileep Konatham Arrest: బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్‌ అరెస్ట్, ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెట్టిన పోస్టుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు, అరెస్టుపై మండిపడిన హరీష్ రావు

BRS social media in-charge Kontham Dileep arrested (photo-Srinivasareddy/X)

బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్‌ను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు సోమవారం(నవంబర్‌ 18) అరెస్టు చేశారు. సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారన్న కారణంగా దిలీప్‌ను అరెస్టు చేసినట్లు సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. దిలీప్‌ను అరెస్టు చేసిన అనంతరం ఆయనకు ఉస్మానియా ఆస్పత్రితో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.

హైడ్రా 2.0.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. సంగారెడ్డిలో కూల్చివేతలు షురూ.. (వీడియో)

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎక్స్‌(ట్విటర్‌)లో పెట్టిన పోస్టుకు సంబంధించిన కేసులో దిలీప్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దిలీప్‌ అరెస్టుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. కాగా కొణతం దిలిప్‌ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో డిజిటల్‌ మీడియా వింగ్‌కు తొలి డైరెక్టర్‌గా పనిచేశారు.

BRS social media in-charge Kontham Dileep arrested