Telangana: సిగ్గు, లజ్జ ఉంటే చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబానికి పరామర్శ
ఈ దంపతుల ముగ్గురు పిల్లల పరిస్థితి పట్ల కేటీఆర్ చలించిపోయారు. ఆ ముగ్గురు పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు తన పిల్లల మాదిరిగానే చదివిస్తానని హామీ ఇచ్చారు.
సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పరామర్శించారు. ఈ దంపతుల ముగ్గురు పిల్లల పరిస్థితి పట్ల కేటీఆర్ చలించిపోయారు. ఆ ముగ్గురు పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు తన పిల్లల మాదిరిగానే చదివిస్తానని హామీ ఇచ్చారు.
అంతేకాదు, ఆ పిల్లల పేరిట రూ.2 లక్షల చొప్పున ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ధ్వజమెత్తారు. బతుకమ్మ చీరల కాంట్రాక్టు రద్దు చేయడం వల్లే సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నల ఆత్మహత్యలు పెరిగాయని వ్యాఖ్యానించారు. సిగ్గు, లజ్జ ఉంటే చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Here's BRS Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)