Yediyurappa Sex Assault Case: లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన యడ్యూరప్ప, మా ఇంట్లో ఆ మహిళ నాకు వ్యతిరేకంగా మాట్లాడిందని, అందుకే కేసు పెట్టిందని వెల్లడి
దీంతో పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు
తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు పెట్టిన సంగతి విదితమే. దీంతో పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఒక కేసులో సాయం అడిగేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొంది.
తనపై లైంగిక దాడి కేసు నమోదవడంపై యడ్యూరప్ప స్పందించారు. ఒక మహిళ కూతురిని తీసుకొని ఫిబ్రవరి 2వ తేదీన తన ఇంటికి వచ్చిన మాట నిజమేనని చెప్పారు. ఆమెకు ఒక కేసు విషయంలో సాయం అవసరమైతే పోలీస్ కమిషనర్‌కు స్వయంగా ఫోన్ చేశానని చెప్పారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఆమె తనకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించిందన్నారు. తర్వాత పోలీసులు తనపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసు వెనుక రాజకీయ కారణాలున్నాయా లేదా అనేది చెప్పలేనన్నారు. ఏం జరుగుతుందో చూద్దామన్నారు. యడ్యూరప్ప ఇప్పటికి మూడుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. నా కుమార్తెపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.. బాలిక తల్లి ఫిర్యాదుతో కర్ణాటక మాజీ సీఎంపై పోక్సో కేసు నమోదు
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)