Bulandshahr Shocker: ఛీ వీడు అసలు కన్నకొడుకేనా, కన్నతల్లిని రోడ్డు మీద పరిగెత్తించి కొట్టిన కసాయి, గుడిలో పట్టుకుని దారుణంగా కొడుతుంటే చోద్యం చూసిన జనాలు
యూపీలోని బులంద్ షహర్ లో మానవత్వం మంటగలిసిన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు కన్నతల్లిని కర్రతో కొడుతూ రోడ్డుపై పరిగెత్తించిన వీడియో బయటకు వచ్చింది.ఆ యువకుడు చేతిలో కట్టె పట్టుకుని నింపాదిగా నడుస్తూ వస్తుండగా.. కొడుకుకు అందకుండా ఆ తల్లి పడుతూ లేస్తూ పరిగెత్తడం వీడియోలో కనిపిస్తోంది.
యూపీలోని బులంద్ షహర్ లో మానవత్వం మంటగలిసిన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు కన్నతల్లిని కర్రతో కొడుతూ రోడ్డుపై పరిగెత్తించిన వీడియో బయటకు వచ్చింది.ఆ యువకుడు చేతిలో కట్టె పట్టుకుని నింపాదిగా నడుస్తూ వస్తుండగా.. కొడుకుకు అందకుండా ఆ తల్లి పడుతూ లేస్తూ పరిగెత్తడం వీడియోలో కనిపిస్తోంది. సాయం చేయాలంటూ అరుస్తూ ఆ తల్లి పరిగెత్తడం చూస్తే అందరినీ కలిచివేస్తోంది. ఓ గుడి ఆవరణలో ఇదంతా జరుగుతున్నా చుట్టుపక్కల ఉన్న జనం చోద్యం చూస్తూ నిలబడ్డారే కానీ ఆ తల్లికి ఎవరూ సాయం చేయలేదు. చివరకు తల్లిని దొరికించుకున్న ఆ యువకుడు కట్టెతో విచక్షణారహితంగా కొట్టాడు.
అక్కడే ఉన్న స్థానికుడు ఒకరు ఈ దారుణాన్ని తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఎట్టకేలకు స్పందించిన జనం.. ఆ యువకుడిని పట్టుకుని తల్లిని కాపాడారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు యువకుడిని అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమోసా షాపులోకి దూసుకొచ్చిన బెంజ్ కారు, ఆరుగురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Here's Video