'Bulli Bai' App Case: బుల్లీ బాయ్ యాప్ కేసులో ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్, వందల సంఖ్యలో ముస్లిం మహిళల ఫొటోలు, వేలం నిర్వహించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం
దేశవ్యాప్తంగా కలకలం రేపిన 'బుల్లీ బాయ్' యాప్ కేసులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బుల్లీ బాయ్ అనే యాప్ లో వందల సంఖ్యలో ముస్లిం మహిళల ఫొటోలు వెలుగు చూడడం తెలిసిందే. ఆ మహిళలు అమ్మకానికి ఉన్నారంటూ వేలం నిర్వహించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడంతో విషయం తెరపైకి వచ్చింది.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన 'బుల్లీ బాయ్' యాప్ కేసులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బుల్లీ బాయ్ అనే యాప్ లో వందల సంఖ్యలో ముస్లిం మహిళల ఫొటోలు వెలుగు చూడడం తెలిసిందే. ఆ మహిళలు అమ్మకానికి ఉన్నారంటూ వేలం నిర్వహించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడంతో విషయం తెరపైకి వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబయి సైబర్ సెల్ పోలీసులు బెంగళూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ యాప్ కు నలుగురు ఫాలోవర్లు ఉండగా, వారిలో ఈ విద్యార్థి ఒకడని గుర్తించారు. పోలీసులు అతడిని ముంబయి తీసుకువస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా, 'బుల్లీ బాయ్' యాప్ ను తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించినట్టు మైక్రోసాఫ్ట్ కు చెందిన ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ వేదిక గిట్ హబ్ వెల్లడించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)