Bus Accident in Jammu and Kashmir: ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి, 61 మందికి తీవ్ర గాయాలు, జమ్మూలో అదుపుతప్పి లోయలో పడిన బస్సు

జమ్ము- పూంఛ్ రహదారిపై బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 21 మంది మృతి చెందారని, 40 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

Bus Accident in Jammu and Kashmir: 21 Killed, 69 Injured As Bus Falls Into Gorge on Jammu-Poonch Highway in Akhnoor (Watch Videos)

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జమ్ము- పూంఛ్ రహదారిపై బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 21 మంది మృతి చెందారని, 40 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌ నుంచి ప్రయాణికులతో బయల్దేరిన బస్సు.. జమ్ములోని అఖ్నూర్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. జమ్ము-పూంఛ్ రహదారిపై అదుపుతప్పి లోయలో పడిపోయింది’’ అని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగతున్నాయని చెప్పారు. గాయపడిన వారిని అఖ్నూర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.  వీడియో ఇదిగో, రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి బైక్‌ను ఢీకొట్టిన కారు, ఇద్దరికీ తీవ్ర గాయాలు

ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. అఖ్నూర్‌లో బస్సు ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్‌గ్రేసియా అందిస్తామని తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)