Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, సరోగసి కోసం ఇంటికి పిలిచి లైంగిక వేధింపులు, అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తుపై నుండి దూకి చనిపోయిన మహిళ
హైదరాబాద్ మై హోమ్ భుజ అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తు పై నుండి దూకి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ (25) అనే మహిళ మృతిచెందింది. సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం అశ్విత సింగను రాజేష్ బాబు అనే వ్యక్తి తెచ్చుకున్నారు.
హైదరాబాద్ మై హోమ్ భుజ అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తు పై నుండి దూకి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ (25) అనే మహిళ మృతిచెందింది. సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం అశ్విత సింగను రాజేష్ బాబు అనే వ్యక్తి తెచ్చుకున్నారు. పిల్లలను కనివ్వడం కోసం పది లక్షల డీల్‌ను రాజేష్ బాబు మాట్లాడుకున్నారు.
అయితే గత కొన్నాళ్లుగా అశ్వితను లైంగికంగా వేధిస్తున్నాడు రాజేష్ బాబు.అతని ప్రవర్తన నచ్చకపోవడంతో పారిపోవడానికి ప్రయత్నించిన అశ్విత సింగ్. కాగా తప్పించుకునే క్రమంలో అపార్ట్‌మెంట్ తొమ్మిదవ అంతస్తు పై నుండి దూకి చనిపోయింది. అశ్విత సింగ్‌కు భర్త, నాలుగు సంవత్సరాలలో బాబు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.రాజేష్ బాబు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Woman died after jumping from ninth floor of apartment
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)