Haryana: 22 కిలోమీటర్లు స్మగ్లరను వెంటాడి పట్టుకున్న పోలీసులు, హాలీవుడ్ మూవీ రేంజ్‌లో ఛేజ్ చేసి నిందితులను పట్టుకున్న గురుగ్రామ్ పోలీసులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
అక్రమంగా గోవులను తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాను గురుగ్రామ్ పోలీసులు అర్ధరాత్రి ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఐదుగురు పశువుల స్మగ్లర్లు గోవులను అక‍్రమంగా తరలిస్తుండగా పోలీసులు వారి వాహనాన్ని వెంబడించారు.
అక్రమంగా గోవులను తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాను గురుగ్రామ్ పోలీసులు అర్ధరాత్రి ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఐదుగురు పశువుల స్మగ్లర్లు గోవులను అక‍్రమంగా తరలిస్తుండగా పోలీసులు వారి వాహనాన్ని వెంబడించారు. అయితే, స్మగ‍్లర్లు ఢిల్లీ బోర్డర్ నుండి గురుగ్రామ్‌లోకి ప్రవేశిస్తుండగా పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్మగ్లర్లు లారీని ఆపకుండా స్పీడ్‌గా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వారిని వెంబడించి దాదాపు 22 కిలోమీటర్ల దూరం ఛేజింగ్ చేసిన తర్వాత వారిని పట్టుకున్నారు. హాలీవుడ్ మూవీ రేంజ్‌లో రోడ్డుపై లారీని ఛేజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఛేజ్ చేసే క్రమంలో పోలీసులు.. స్మగ్లర్ల లారీపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్ల్లో లారీ టైర్ పేలిపోయినప్పటికీ వారు వాహనాన్ని మాత్రం ఆపలేదు. కాగా, లారీ పట్టుకున్న తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత లారీలో తనిఖీలు చేపట్టగా అందులో తుపాకులు, బుల్లెట్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)