Char Dham Yatra 2022: చార్‌థామ్ యాత్రలో విషాదం, ఆరు రోజుల్లో 20 మంది మృతి, బాధితుల్లో ఎక్కువ శాతం గుండె సంబంధిత స‌మ‌స్య‌లతో మరణించారని తెలిపిన రాష్ట్ర ఆరోగ్యశాఖ

ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. చాలా వ‌ర‌కు బాధితుల్లో ఎక్కువ శాతం గుండె సంబంధిత స‌మ‌స్య‌లు లేదా హై ఆల్టిట్యూడ్ సిక్నెన‌స్‌తో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆరోగ్య‌శాఖ చెప్పింది.

Char Dham yatra. (Photo Credit: Wikimedia Commons)

ఉత్త‌రాఖండ్‌లో చార్‌థామ్ యాత్ర ప్రారంభ‌మైన ఆరు రోజుల్లోనే ఇప్ప‌టికే 20 మంది భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. చాలా వ‌ర‌కు బాధితుల్లో ఎక్కువ శాతం గుండె సంబంధిత స‌మ‌స్య‌లు లేదా హై ఆల్టిట్యూడ్ సిక్నెన‌స్‌తో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆరోగ్య‌శాఖ చెప్పింది. ఈ నెల 3వ తేదీన గంగోత్రి, య‌మునోత్రి ఆల‌యాల‌ను తెరిచారు. ఇక కేదార్‌నాథ్‌ను మే 6వ తేదీన‌, బ‌ద్రీనాథ్‌ను మే 8వ తేదీన తెరిచిన విష‌యం తెలిసిందే. య‌మునోత్రి, గంగోత్రి థామ్‌ల వ‌ద్ద సోమ‌వారం నాటికి 14 మంది ప్ర‌యాణికుల‌తో పాటు ఓ నేపాలీ కార్మికుడు తుదిశ్వాస విడిచిన‌ట్లు చార్‌థామ్ యాత్ర అడ్మినిస్ట్రేష‌న్ వెల్ల‌డించింది.

ఇక కేదార్‌నాథ్‌లో అయిదుగురు, బ‌ద్రీనాథ్‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు చార్‌థామ్ బోర్డు తెలిపింది. యాత్ర ప్రారంభ‌మైన ఆరు రోజుల్లో ఎక్కువ సంఖ్య‌లో భ‌క్తులు ప్రాణాలు కోల్పోవ‌డ ప‌ట్ల యాత్ర నిర్వాహ‌కులు, అడ్మినిస్ట్రేష‌న్ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది. చార్‌థామ్ యాత్ర‌లో ఎక్కువ‌గా న‌డ‌క ఉండ‌డం వ‌ల్ల.. అందులో ఎక్కువ శాతం భ‌క్తులు వృద్ధులు కావ‌డంతో మ‌ర‌ణాల సంఖ్య అధికంగా ఉన్న‌ట్లు భావిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif