Chhattisgarh: స్నేహితుడి భార్యతో సెక్స్ కావాలని కోరిన బీజేపీ కౌన్సిలర్, చెప్పుతో ఎడాపెడా వాయించిన ఫ్రెండ్ భార్య, కౌన్సిలర్ పరారీలో ఉన్నట్లు తెలిపిన సిగ్మా పోలీసులు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో స్నేహితుడి భార్యపై మోహంతో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేత చివరికి ఆమె చేతిలోనే చెప్పుదెబ్బలు తిన్నాడు, సూర్యకాంత్ తమ్రకర్ అనే బీజేపీ కౌన్సిలర్ 15 రోజుల క్రితం తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు.

Sexual Harassment. Representational Image | (Photo Credits: PTI)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో స్నేహితుడి భార్యపై మోహంతో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేత చివరికి ఆమె చేతిలోనే చెప్పుదెబ్బలు తిన్నాడు, సూర్యకాంత్ తమ్రకర్ అనే బీజేపీ కౌన్సిలర్ 15 రోజుల క్రితం తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అనంతరం తన స్నేహితుడి భార్యపై తనలోని కామవాంఛను వెల్లగక్కాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న సరదు మహిళ.. బీజేపీ కౌన్సిలర్ వదిన తల్లిలాంటిదని, ఇలా అడగడానికి మనసెలా వచ్చిందని నిలదీసింది. అయితే వదిన, మరుదుల మధ్య ఇలాంటివి సర్వసాధారణం అని ఆమెను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశాడు కౌన్సిలర్. వెంటనే తన చెప్పు తీసుకుని అతడిని చెడాపెడా వాయించింది. అక్కడే ఉన్న భర్త ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడు కూడా ఆమె కోపానికి చెప్పుదెబ్బలు తిన్నాడు. సిగ్మా పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై కేసు నమోదు అయింది. కాగా, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని, కౌన్సిలర్ పరారీలో ఉన్నట్లు సిగ్మా పోలీసులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement