Chhattisgarh Encounter:మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా చనిపోలేదు, ఆ వార్తలో వాస్తవం లేదు, లేఖ విడుదల చేసిన మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటి
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) మొదటి బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా చనిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదంటూ మావోయిస్టు కమిటీ తెలిపింది.ఈ మేరకు హిందీలో లేఖ విడుదల చేసింది.
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) మొదటి బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా చనిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదంటూ మావోయిస్టు కమిటీ తెలిపింది.ఈ మేరకు హిందీలో లేఖ విడుదల చేసింది. బుధవారం జరిగిన కాల్పుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే.. తాజాగా మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటి కార్యదర్శి పేరుతో లేఖ విడుదల అయ్యింది. అందులో ‘‘కేంద్ర కమిటీ సభ్యుడిగా హిడ్మా చనిపోలేదు. చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. హిడ్మా సేఫ్ గా ఉన్నాడని తెలిపింది.