Chhattisgarh Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్రక్కు, ఐదుగురు అక్కడికక్కడే మృతి, మరో 17మందికి గాయాలు, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం

మంగళవారం అర్ధరాత్రి గరియాబంద్‌ సమీపంలో జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 17 మంది గాయపడ్డారు

Accident Representative image (Image: File Pic)

ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి గరియాబంద్‌ సమీపంలో జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రుల్లో 14 మందిని ఆస్పత్రికు తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గరియాబంద్‌ నుంచి మెయిన్‌పురి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు.

గరియాబంద్ ప్రమాద ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ బఘేల్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇస్తామని.. గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)