Bihar: 7వ తరగతి ప్రశ్నా పత్రంలో వేరే దేశంగా కాశ్మీర్, బీహార్ కిషన్‌గంజ్ ప్రభుత్వ పాఠశాల్లో వివాదాస్పదంగా మారిన ప్రశ్న
బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో ఒక ప్రభుత్వ పాఠశాల్లో ఇచ్చిన ప్రశ్న పత్రంలో నేపాల్, చైనా, ఇంగ్లాండ్, కాశ్మీర్, భారత్ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉంది.
బీహార్ రాష్ట్రంలో ఏడో తరగతి ఆంగ్ల ప్రశ్నపత్రంలోని ఒక ప్రశ్న పెద్ద వివాదాస్పదంగా మారింది. బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో ఒక ప్రభుత్వ పాఠశాల్లో ఇచ్చిన ప్రశ్న పత్రంలో నేపాల్, చైనా, ఇంగ్లాండ్, కాశ్మీర్, భారత్ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉంది. ఇందులో కాశ్మీర్‌ని వేరే దేశంగా పొరపాటున రావడంతో వివాదానికి దారితీసింది. అంతేగాదు ఈ వివాదం కాస్త చిలికిచిలికి రాజకీయ దుమారానికి తెరలేపింది.
ఇది పొరపాటు కాదని కావలనే ఇలా చేశారంటూ ఆ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ సుశాంత గోపీ విమర్శలు గుప్పించారు. పిల్లలు మనసుల్లో కాశ్మీర్‌ను భారత్‌ని వేరుచేసి చూపించే ప్రయత్నం చేస్తోంది నితీశ్ నేతృత్వంలోని ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ఆ పాఠశాల హెడ్‌మాస్టర్ ఎస్‌కే దాస్ ఈ విషయమై వివరణ ఇస్తూ...ఆ ప్రశ్న పత్రంలో ప్రశ్న కాశ్మీర్ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉండటానికి బదులు కాశ్మీర్ దేశ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉంది. ఇది మానవ తప్పిదమే తప్ప మరోకటి కాదని వివరణ ఇచ్చారు. అంతేగాదు ఆ జిల్లా విద్యాధికారి సుభాష్ గుప్త అనవసరంగా ఈ విషయాన్ని కావాలనే పెద్దది చేస్తున్నారన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)