CM Nitish Kumar Security Breach: సీఎం నితీశ్ కుమార్ వైపు దూసుకొచ్చిన బైక్, వెంటనే ఫుట్ పాత్ పైకి జంప్ చేసిన బీహార్ ముఖ్యమంత్రి

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భద్రతలో భారీ వైఫల్యం కలకలం రేపుతోంది. ఈ ఉదయం మార్నింగ్ వాక్ కోసం తన నివాసం నుంచి సర్క్యులర్ రోడ్డుకు వెళ్లారు. సీఎం వాకింగ్ కు వచ్చిన నేపథ్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. అయితే, ఇద్దరు వ్యక్తులు రెండు బైక్ లపై ఆ రోడ్డుపైకి వచ్చారు.

Bihar CM Nitish Kumar (Photo Credit: ANI)

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భద్రతలో భారీ వైఫల్యం కలకలం రేపుతోంది. ఈ ఉదయం మార్నింగ్ వాక్ కోసం తన నివాసం నుంచి సర్క్యులర్ రోడ్డుకు వెళ్లారు. సీఎం వాకింగ్ కు వచ్చిన నేపథ్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. అయితే, ఇద్దరు వ్యక్తులు రెండు బైక్ లపై ఆ రోడ్డుపైకి వచ్చారు. భద్రతా వలయాన్ని దాటుకుని సీఎం వైపు దూసుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన నితీశ్ వెంటనే ఫుట్ పాత్ పైకి దూకారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంబడించి బైకర్లను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన జరిగిన సర్క్యులర్ రోడ్డులో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సహా పలువురి నివాసాలు ఉన్నాయి. ఘటన జరిగిన తర్వాత ఎన్ఎస్జీ కమాండెంట్, పాట్నా ఎస్ఎస్పీని పిలిపించుకుని నితీశ్ మాట్లాడారు.

IANS Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement