CM Revanth Reddy: సోషల్ మీడియా పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, బావ- బామ్మర్థులకు మా పవర్ త్వరలో తెలుస్తుంది..పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మీరు ఏం వెలగబెట్టారో చెప్పాలని డిమాండ్
వేములవాడలో మాట్లాడిన రేవంత్.. రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేస్తే పెద్దామనిషిగా అభినందించాల్సింది పోయి చిల్లర మాటలు మాట్లాడతారా అని మండిపడ్డారు.
సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెట్టి మొనగాళ్ళు అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడలో మాట్లాడిన రేవంత్.. రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేస్తే పెద్దామనిషిగా అభినందించాల్సింది పోయి చిల్లర మాటలు మాట్లాడతారా అని మండిపడ్డారు.
పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపి మీరు ఏం వెలగబెట్టారు ? , మీరు 10 ఏళ్లలో చేసిన రైతు రుణమాఫీ లెక్కలు తీద్దాం అని సవాల్ విసిరారు. మీరు చేయలేని పనులను మేము చేస్తుంటే కడుపు మండుతుందా ? , త్వరలో జరిగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మా కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు అని తేల్చిచెప్పారు. అప్పుడు తెలుస్తుంది బావ బామ్మర్దులకు మా కార్యకర్తల పవర్ అన్నారు. వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి, రూ.127 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్న తెలంగాణ సీఎం
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)