Congress Protest: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ప్రధాని నివాస ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నివాస ముట్టడితో పాటు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావించారు. ఈలోపు నిరసనలకు దిగిన రాహుల్, ప్రియాంకతో పాటు పలువురు ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళనల్లో భాగంగా పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ రోడ్డులో రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. అయితే పారామిలిటరీ, పోలీసు బలగాలు ఆ మార్గాన్ని బ్లాక్ చేశాయి. ఎవరూ ముందుకు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలోనే రాష్ట్రపతి భవన్ మార్గంలో వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించాలని కాంగ్రెస్ భావించింది.