Covid in India: దేశంలో కొత్తగా 3545 కరోనా కేసులు, గత 24 గంటల్లో 27 మంది మృతి, మొత్తం 19,688 కేసులు యాక్టివ్‌

దేశంలో కొత్తగా 3545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,94,938కు చేరాయి. ఇందులో 4,25,51,248 మంది కోలుకున్నారు. మరో 5,24,002 మంది మరణించగా, 19,688 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 27 మంది కరోనాకు బలవగా, 3549 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Representative image

దేశంలో కొత్తగా 3545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,94,938కు చేరాయి. ఇందులో 4,25,51,248 మంది కోలుకున్నారు. మరో 5,24,002 మంది మరణించగా, 19,688 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 27 మంది కరోనాకు బలవగా, 3549 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఐదు రాష్ట్రాల్లోనే 79.82 కేసులు ఉన్నాయని, ఇందులో ఢిల్లీలో 1365 కేసులు (38.5 శాతం) నమోదవగా, హర్యానాలో 534, ఉత్తరప్రదేశ్‌లో 356, కేరళ 342, మహారాష్ట్రలో 233 కేసులు రికార్డయ్యాయని వెల్లడించింది.ఇక ఇప్పటివరకు 1,89,81,52,695 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో 16,59,843 మందికి గురువారం వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది. అదేవిధంగా నిన్న ఒక్కరోజే 4,23,430 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement