DK Shivakumar: అందరికీ ఉచిత వ్యాక్సిన్‌ను కర్ణాటక ప్రభుత్వం ఇంకా ఎందుకు ప్రకటించలేదు?, ప్రపంచ వ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ ఇస్తూ వ్యాక్సిన్ ధరలపై చర్చిస్తున్న ఏకైక దేశం ఇండియానే, ట్విట్టర్‌లో విరుచుకుపడిన డికె శివకుమార్

ప్రపంచ వ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ ఇస్తూ వ్యాక్సిన్ ధరలపై చర్చిస్తున్న ఏకైక దేశం ఇండియానే కావచ్చు.

DK Shivakumar (Photo Credits: PTI)

అందరికీ ఉచిత వ్యాక్సిన్‌ను కర్ణాటక ప్రభుత్వం ఇంతవరకూ ఎందుకు ప్రకటించలేదు? పౌరులందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలన్నదే (DK Shivakumar demands free vaccination for all citizens) నా డిమాండ్' అని డీకే ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈనెల 21న కూడా ఆయన (Karnataka Congress president DK Shivakumar) ఉచిత వ్యాక్సిన్ డిమాండ్ చేశారు.

రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్ సేకరణకు వేర్వేరు రేట్లు ఉండటం వివక్షాపూరితమని, దీని వల్ల అందరికీ వ్యాక్సినేషన్ చేరువకాదని ఆయన వ్యాఖ్యానించారు. నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీలో లాభాల ఆర్జనను అనుమతించ రాదని అన్నారు. సంక్షేమ చర్చగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)