COVID in Mumbai: ముంబైలో కరోనా కల్లోలం, ఒక్కరోజే 2,510 కొత్త కేసులు, గత 24 గంటల్లో ఒకరు మృతి, నూతన సంవత్సర వేడుకల కోసం మార్గదర్శకాలను విడుదల చేసిన సర్కారు

గత 24 గంటల్లో 2,510 కొత్త కేసులు (Covid in Mumbai) నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. కొత్తగా 251 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆర్థిక రాజధానిలో ప్రస్తుతం 8060 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Coronavirus in India (Photo Credits: PTI)

ముంబైలో కరోనా ఒక్కసారిగా పంజా విసిరింది. గత 24 గంటల్లో 2,510 కొత్త కేసులు (Covid in Mumbai) నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. కొత్తగా 251 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆర్థిక రాజధానిలో ప్రస్తుతం 8060 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆడిటోరియంలలోని కార్యక్రమాలకు 50 శాతం సామర్థ్యాన్ని నింపడానికి అనుమతించబడింది.

బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలకు 25 శాతం సామర్థ్యం ఉండేలా అనుమతించారు. వేడుకలను ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. బీచ్‌ ఫ్రంట్‌లు, పార్కుల వద్ద గుమికూడకుండా చూడాలని కోరారు. గేట్‌వే ఆఫ్ ఇండియా, మెరైన్ లైన్స్, గిర్‌గామ్ చౌపాటీ మరియు జుహు చౌపటీ వద్ద రద్దీగా ఉండకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)