Omicron in Mumbai: ముంబైలో జనవరి 31 వ వరకు పాఠశాలల మూసివేత, 10, 12 తరగతి విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు హాజరవుతారని తెలిపిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌

ముంబైలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అధికంగా నమోదవుతుండంతో ముంబైలోని పాఠశాలల మూసివేత జనవరి 31 వ వరకు కొనసాగుతుందని ప్రకటించింది.

School Student (Representational Image (Photo Credits: Pixabay)

ముంబైలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అధికంగా నమోదవుతుండంతో ముంబైలోని పాఠశాలల మూసివేత జనవరి 31 వ వరకు కొనసాగుతుందని ప్రకటించింది. 1 నుంచి 9, అలాగే 11 వ తరగతి వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. 10, 12 తరగతి విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు హాజరవుతారని పేర్కొంది. 1నుంచి 9 తరగతి విద్యార్థులకు ముందుగా నిర్ధేశించిన విధంగా ఆన్‌లైన్‌ క్లాస్‌లు కొనసాగుతాయని పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now