Covid in India: గత 24 గంటల్లో కరోనాతో 29 మంది మృతి, కొత్తగా 9,629 మందికి పాజిటివ్, ప్రస్తుతం దేశంలో 61,013 కేసులు యాక్టివ్‌

దేశంలో గత 24 గంటల్లో 1,79,031 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,629 మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం దేశంలో 61,013 కేసులు యాక్టివ్‌ (Active Cases) గా ఉన్నాయి. ఇక 24 గంటల వ్యవధిలో 11,967 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,23,045కి చేరింది.

Covid in India (PIC @ PTI)

దేశంలో గత 24 గంటల్లో 1,79,031 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,629 మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం దేశంలో 61,013 కేసులు యాక్టివ్‌ (Active Cases) గా ఉన్నాయి. ఇక 24 గంటల వ్యవధిలో 11,967 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,23,045కి చేరింది. కేరళలో 10 మంది, ఢిల్లీలో ఆరుగురు, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ముగ్గురు చొప్పున, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు చొప్పున, ఒడిశా, గుజరాత్‌, చత్తీస్‌గఢ్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,398 కి ఎగబాకింది. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.14 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,50,086) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement