Coronavirus in India: దేశంలో లక్షా నలభై వేల దిగువకు పడిపోయిన యాక్టివ్ కేసులు, కొత్త‌గా 11,466 మందికి కోవిడ్, 24 గంటల్లో 460 మంది మృతి

అలాగే, 460 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,39,683 మంది చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క‌రోనా నుంచి నిన్న 11,961 మంది కోలుకున్నారు.

COVID Outbreak - Representational Image (Photo-PTI)

దేశంలో కొత్త‌గా 11,466 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 460 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,39,683 మంది చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క‌రోనా నుంచి నిన్న 11,961 మంది కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 3,37,87,047 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల దేశంలో మొత్తం 4,61,849 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న దేశంలో 52,69,137 డోసుల క‌రోనా వ్యాక్సిన్ వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 109,63,59,205 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కేర‌ళ‌లో నిన్న 6,409 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయింది. 47 మంది ప్రాణాలు కోల్పోయారు.