Coronacases in India: భారీగా తగ్గిన కరోనా కేసులు, 77వేలకు చేరిన యాక్టీవ్ కేసులు, పలు రాష్ట్రాల్లో రెండంకెలకు చేరిన రోజువారీ కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు (Corona Cases) భారీగా తగ్గాయి. కొత్తగా 6,561 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,45,160 కి చేరాయి. ఇందులో 4,23,53,620 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా(Recoveries), 5,14,388 మంది మరణించారు. మరో 77,152 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry of India) తెలిపింది.

Coronavirus | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, March 03: దేశంలో కరోనా కేసులు (Corona Cases) భారీగా తగ్గాయి. కొత్తగా 6,561 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,45,160 కి చేరాయి. ఇందులో 4,23,53,620 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా(Recoveries), 5,14,388 మంది మరణించారు. మరో 77,152 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry of India) తెలిపింది.కాగా, గత 24 గంటల్లో 142 మంది కరోనా కరోనాకు బలవగా, 14,947 మంది కోలుకున్నారని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో ఉన్నాయి. రాష్ట్రంలో 2373 మందికి కరోనా సోకింది. ఇక మహారాష్ట్రలో (Maharashtra) 544 కేసులు, ఢిల్లీలో 325, తమిళనాడులో 320, ఉత్తరప్రదేశ్‌లో 216, మధ్యప్రదేశ్‌లో 259, హర్యానా 232 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement