Bihar: చెత్త రిక్షాలో క‌రోనాతో చ‌నిపోయిన మృత‌దేహం తరలింపు, బీహార్‌లో అమానుష ఘటన, సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారిన వీడియో, ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపిన అధికారులు

బీహార్‌లో క‌రోనాతో చ‌నిపోయిన ఓ వ్య‌క్తి మృత‌దేహాన్ని మున్సిపాలిటీ చెత్త రిక్షాలో శ్మశాన‌వాటికకు త‌ర‌లించారు. రాష్ట్రంలోని న‌లందా జిల్లాకు చెందిన మ‌నోజ్ కుమార్ అనే వ్య‌క్తి ఈ నెల 13న‌ క‌రోనాతో మ‌ర‌ణించాడు. అత‌ని మృత‌దేహాన్ని తీసుకెళ్ల‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదు.

COVID-19 Patient’s Dead Body Carried to Crematorium (Photo-ANI)

బీహార్‌లో క‌రోనాతో చ‌నిపోయిన ఓ వ్య‌క్తి మృత‌దేహాన్ని మున్సిపాలిటీ చెత్త రిక్షాలో శ్మశాన‌వాటికకు త‌ర‌లించారు. రాష్ట్రంలోని న‌లందా జిల్లాకు చెందిన మ‌నోజ్ కుమార్ అనే వ్య‌క్తి ఈ నెల 13న‌ క‌రోనాతో మ‌ర‌ణించాడు. అత‌ని మృత‌దేహాన్ని తీసుకెళ్ల‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదు. దీంతో న‌లంద మున్సిప‌ల్ సిబ్బంది నిన్న ఆ మృత‌దేహాన్ని చెత్త రిక్షాలో స్మ‌శాన వాటికకు త‌ర‌లించారు. పీపీఈ కిట్లు ధ‌రించిన సిబ్బంది అత‌న్ని ఖ‌ననం చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. కాగా, దీనిపై న‌లంద సివిల్ స‌ర్జ‌న్ స్పందించారు. అత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌డానికి 2 వంద‌ల‌కుపైగా వాహ‌నాలు అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించామ‌ని, బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement