COVID-19 Scare in Tamil Nadu: తమిళనాడులో మాస్క్ తప్పనిసరి, ఆంక్షలు విధించిన స్టాలిన్ సర్కారు, విదేశాల నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్

తమిళనాడు చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళ, బుధవారాల్లో దుబాయ్‌, చైనా నుంచి స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో దిగిన అనంతరం వారికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ పేర్కొంది.

Representational Image (File Photo)

తమిళనాడు చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళ, బుధవారాల్లో దుబాయ్‌, చైనా నుంచి స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో దిగిన అనంతరం వారికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో, వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. బుధవారం ఉదయం దుబాయ్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు చైన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కరోనా టెస్టుల సందర్బంగా వీరికి పాజిటివ్‌గా తేలింది.

దీంతో​, తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు నలుగురి శాంపిల్స్‌ను జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపినట్టు తెలిపారు.మరోవైపు..కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటటంతో న్యూ ఇయర్ వేడుకలపై స్టాలిన్ సర్కారు ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement