Center Covid Advisory: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు, కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

తాజాగా జేఎన్1 కరోనా సబ్ వేరియంట్ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

Coronavirus (Photo-ANI)

Modi Government Covid Advisory: భారత్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా జేఎన్1 కరోనా సబ్ వేరియంట్ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

కరోనా లక్షణాలు ఉంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని పేర్కొంది. టెస్టుల్లో పాజిటివ్ వస్తే ఆ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లోనూ పరిస్థితిని సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసింది. భారత్ లో ప్రస్తుతం ఎక్స్ బీబీ వేరియంట్ తో పాటు జేఎన్1 సబ్ వేరియంట్ వ్యాపిస్తున్నట్టు వెల్లడైంది. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 335 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు మరణించడంతో కేంద్రం అప్రమత్తమైంది. కేరళలో కరోనా కొత్త వేరియంట్ కలకలం, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు

Here's ANI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)