COVID-19 Surge: 2 కోట్ల కోవిషీల్డ్‌ టీకా డోసులు ఫ్రీ, భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని తెలిపిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా

కోవిడ్‌–19 మళ్లీ పంజా విప్పిన నేపథ్యంలో పుణేలోని వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా దాతృత్వం చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్‌ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి

Coronavirus Vaccine Covishield (Photo Credits: Twitter/@AdarPoonwalla)

కోవిడ్‌–19 మళ్లీ పంజా విప్పిన నేపథ్యంలో పుణేలోని వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా దాతృత్వం చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్‌ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి. రూ.410 కోట్ల విలువైన 2 కోట్ల కోవిషీల్డ్‌ టీకా డోసులను ఉచితంగా అందజేస్తామంటూ సీరం సంస్థ ప్రతినిధి ప్రకాశ్‌కుమార్‌ సింగ్‌ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారని వెల్లడించాయి. ఈ డోసులు ఎలా అందజేయాలో చెప్పాలంటూ ఆయన కోరారని పేర్కొన్నాయి. సీరం సంస్థ ఇప్పటికే 170 కోట్లకు పైగాడోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now