COVID-19 Vaccination: 60 ఏళ్లు దాటిన‌వారంద‌రికీ ప్రికాష‌న్ డోసు, మార్చి 16వ తేదీ నుంచి 12 నుంచి 14 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారికి కోవిడ్ టీకాలు

దీంతో పాటు 60 ఏళ్లు దాటిన‌వారంద‌రికీ ప్రికాష‌న్ డోసు ఇవ్వ‌నున్న‌ట్లు కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 60 ఏళ్లు దాటి వ్యాధుల‌న్న వాళ్ల‌కు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్ ప్రికాష‌న్ టీకాలు ఇచ్చారు.

Covid Vaccination

మార్చి 16వ తేదీ నుంచి 12 నుంచి 14 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారికి కోవిడ్ టీకాల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూక్ మాండ‌వీయ ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో పాటు 60 ఏళ్లు దాటిన‌వారంద‌రికీ ప్రికాష‌న్ డోసు ఇవ్వ‌నున్న‌ట్లు కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 60 ఏళ్లు దాటి వ్యాధుల‌న్న వాళ్ల‌కు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్ ప్రికాష‌న్ టీకాలు ఇచ్చారు. నిపుణులతో మాట్లాడిన త‌ర్వాత 12 నుంచి 14 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న పిల్ల‌ల‌కు టీకాలు ఇవ్వాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి తెలిపారు. అంటే 2008, 2009, 2010 సంవ‌త్స‌రాల్లో పుటిన‌వాళ్ల‌కు ఇక నుంచి టీకాలు ఇవ్వ‌నున్నారు. 14 ఏళ్ల లోపువారికి హైద‌రాబాద్‌కు చెందిన బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ త‌యారు చేసిన కోర్బీవ్యాక్స్ టీకాను ఇవ్వ‌నున్నారు.