Covid BF.7 Variant: కలవరపెడుతున్న BF.7 వేరియంట్, త్వరితగతిన వ్యాక్సినేషన్‌ చేపట్టాలని రాష్ట్రాలకు,కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసిన కేంద్రం

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టాలని రాష్ట్రాలకు శుక్రవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖల ద్వారా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

కరోనా కొత్త వేరియెంట్‌ BF.7పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు పంపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టాలని రాష్ట్రాలకు శుక్రవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖల ద్వారా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

మాస్క్‌లు, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం తప్పనిసరి అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలకు సూచిస్తూనే.. న్యూఇయర్‌ వేడుకలు, పండుగల సీజన్‌ కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. అలాగే రాష్ట్రాలు మళ్లీ వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని తెలిపింది. ఇక ఈ నెల 27న దేశవ్యాప్తంగా కరోనా ఎమర్జెన్సీ సన్నద్ధతపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. అన్ని ఆస్పత్రుల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని తెలిపింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)