Covid 19 in India: మళ్లీ ప్రమాదకరంగా మారుతున్న కరోనా, గత 24 గంటల్లో 12 మంది మృతి, కొత్తగా 761 కేసులు నమోదు, 541కి పెరిగిన జేఎన్‌.1 కేసులు

దేశంలో తాజాగా 24 గంటల వ్యవధిలో 761 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ (Health Ministry) శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 838 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,78,885కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,334 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.నిన్న ఒక్కరోజే 12 మరణాలు నమోదయ్యాయి.

Covid in India (PIC @ PTI)

ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.ఈ తరహా కేసులు 12 రాష్ట్రాలకు పాకాయి. జనవరి 3వ తేదీ వరకూ దేశంలో జేఎన్‌.1 కేసులు 541కి పెరిగాయి. ఈ మేరకు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement