Covid in India: దేశంలో కొత్తగా 9,355 కరోనా కేసులు, గత 24 గంటల్లో 26 మంది మృతి, ప్రస్తుతం 57,410 కేసులు యాక్టివ్‌

9,355 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లగా ఉంది.దేశంలో ప్రస్తుతం 57,410 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి నుంచి 4,43,35,977 మంది కోలుకున్నారు.

COVID-19 representational image (Photo Credit- IANS)

దేశంలో గడిచిన 24 గంటల్లో 2,29,175 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,355 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లగా ఉంది.దేశంలో ప్రస్తుతం 57,410 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి నుంచి 4,43,35,977 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,424గా నమోదైంది.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. వారంరోజుల సగటు పాజిటివిటీ రేటు 5.36 శాతమని తెలిపింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.13 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక దేశంలో ఇప్పటి వరకూ 220.66 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు