COVID in India: దేశంలో మళ్లీ ప్రమాదకరంగా మారుతున్న కరోనా, గత 24 గంటల్లో 16,764 కేసులు న‌మోదు, 1,270కు పెరిగిన ఒమిక్రాన్ కేసులు సంఖ్య, ప్ర‌స్తుతం 91,361 యాక్టివ్ కేసులు

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మొన్న 13,154 కేసులు న‌మోదుకాగా, నిన్న 16,764 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి నిన్న‌ 7,585 మంది కోలుకున్నారు. క‌రోనా కార‌ణంగా నిన్న‌ 220 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ప్ర‌స్తుతం 91,361 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు.

COVID 2019 Outbreak| PTI Photo

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మొన్న 13,154 కేసులు న‌మోదుకాగా, నిన్న 16,764 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి నిన్న‌ 7,585 మంది కోలుకున్నారు. క‌రోనా కార‌ణంగా నిన్న‌ 220 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ప్ర‌స్తుతం 91,361 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. రిక‌వ‌రీ రేటు 98.36 శాతంగా ఉంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,270 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణ‌లో 62, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 16 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని వివ‌రించింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement