Coronavirus in India: దేశంలో కొత్త‌గా 1,660 మందికి కోవిడ్, కొత్తగా 4,100 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపిన వైద్యశాఖ, ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 16,741 కేసులు యాక్టివ్‌

గ‌త వారం రోజుల నుంచి 2 వేల‌కు దిగువ‌న పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,660 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. అయితే 4,100 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపింది.

Coronavirus outbreak | (Photo Credits: IANS)

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌త వారం రోజుల నుంచి 2 వేల‌కు దిగువ‌న పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,660 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. అయితే 4,100 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపింది. ఈ సంఖ్య ప్ర‌స్తుత మ‌ర‌ణాల‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఇటీవ‌ల సంభ‌వించిన మృతుల సంఖ్య అని స్ప‌ష్టం చేసింది. మహారాష్ట్రలోని 4,700 మరణాలు, కేరళలోని 81 మరణాలను సవరించడంతో ఈ భారీ తేడా కనిపించింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 16,741 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 182.87 కోట్ల టీకాల పంపిణీ జ‌రిగింది. గత 24 గంటల్లో 2,349 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.75 శాతానికి చేరుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు