Coronavirus in India: దేశంలో గత 24 గంటల్లో 1,225 మందికి కరోనా, కొత్తగా 1,594 మంది రికవరీ, 28 మంది మృతి

ఇండియాలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,225 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,594 మంది కరోనా నుంచి కోలుకోగా... 28 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 5,21,129 మంది కరోనా కారణంగా మరణించారు.

Representative image

ఇండియాలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,225 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,594 మంది కరోనా నుంచి కోలుకోగా... 28 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 5,21,129 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశంలో 14,307 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.03కి తగ్గింది. ఇప్పటి వరకు 4,24,89,004 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.76కి పెరిగింది. ఇప్పటి వరకు 1,84,06,55,005 డోసుల వ్యాక్సిన్ వేశారు. నిన్న ఒక్కరోజే 22,27,307 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement