Covid in India: దేశంలో గత 24 గంటల్లో 13,313 పాజిటివ్ కేసులు నమోదు, కొత్తగా 38 మంది మృతి, ప్రస్తుతం దేశంలో 83,990 యాక్టివ్ కేసులు

దేశంలో గత 24 గంటల్లో 13,313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 12,249 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదే సమయంలో 10,972 మంది కరోనా నుంచి కోలుకోగా... 38 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 83,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,33,44,958కి పెరిగింది.

Coronavirus test (Photo-ANI)

దేశంలో గత 24 గంటల్లో 13,313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 12,249 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదే సమయంలో 10,972 మంది కరోనా నుంచి కోలుకోగా... 38 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 83,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,33,44,958కి పెరిగింది. వీరిలో 4,27,36,027 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,941 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.60 శాతంగా, పాజిటివిటీ రేటు 2.03 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,96,62,11,973 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 14,91,941 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement