Covid in India: దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా, కొత్తగా 18,819 మందికి సోకిన వైరస్, 1,04,555 కు చేరుకున్న యాక్టివ్ కేసులు

కొత్తగా 18,819 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,34,52,164కు చేరాయి. ఇందులో 4,28,22,493 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,116 మంది కరోనా వల్ల మరణించారు.

Coronavirus

దేశంలో కరోనావైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 18,819 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,34,52,164కు చేరాయి. ఇందులో 4,28,22,493 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,116 మంది కరోనా వల్ల మరణించారు. మరో 1,04,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 13,827 కరోనా నుంచి బయటపడగా, 39 మంది మృతిచెందారు. కరోనా కేసులు భారీగా పెరగడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.16 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.24 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.55%, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 1,97,61,91,554 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.