Covid in India: దేశంలో తగ్గేదేలే అంటున్న కరోనా, గత 24 గంటల్లో 18,930 మందికి కోవిడ్, 1,19,457 కేసులు యాక్టివ్
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,930 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,35,66,739కు పెరిగాయి. ఇందులో 1,19,457 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.
దేశంలో రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్ కేసులు మళ్లీ 19 వేలకు చేరువయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,930 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,35,66,739కు పెరిగాయి. ఇందులో 1,19,457 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,29,21,977 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 5,25,305 మంది కరోనాతో మరణించారు. కొత్తగా 35 మంది మరణించగా, 14,650 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతానికి చేరిందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొన్నది. రికవరీ రేటు 98.53 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని చెప్పింది. ఇప్పటివరకు 198.33 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)