Covid in India: దేశంలో భారీగా పెరిగిన కేసులు, కొత్తగా 20,139 కరోనా కేసులు నమోదు, గత 24 గంటల్లో 38 మంది మృతి

దేశంలో కరోనా మరోసారి పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి. గురువారం 16,906 మంది పాజిటివ్‌ రాగా, తాజాగా ఆ సంఖ్య 20 వేలు దాటింది. ఇవి నిన్నటికంటే 19 శాతం అధికం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 20,139 కరోనా కేసులు నమోదయ్యాయి.

Coronavirus test (Photo-ANI)

దేశంలో కరోనా మరోసారి పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి. గురువారం 16,906 మంది పాజిటివ్‌ రాగా, తాజాగా ఆ సంఖ్య 20 వేలు దాటింది. ఇవి నిన్నటికంటే 19 శాతం అధికం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 20,139 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 4,36,89,989కి చేరాయి. ఇందులో 4,30,28,356 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,557 మంది మృతిచెందారు. మరో 1,36,076 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కరోనాతో కొత్తగా 38 మంది మృతిచెందగా, 16,482 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కేసులు భారీగా నమోదవుతుండటంతో రోజువారి పాజిటివిటీ రేటు 5.10 శాతానికి చేరిందని తెలిపింది. అదేవిధంగా మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.49 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయని ప్రకటించింది. ఇప్పటివరకు 199.27 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement