COVID19: దేశంలో కొత్తగా 3205 కరోనా కేసులు, రోజు రోజుకు పెరుగుతున్న యాక్టివ్ కేసులు, మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపిన కేంద్ర ఆరోగ్యశాఖ

దేశంలో గడిచిన 24గంటల్లో 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,88,118కి చేరాయి. ఇందులో 4,25,44,689 మంది కోలుకోగా, మరో 5,23,920 మంది మృతిచెందారు. ఇంకా 19,509 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 31 మంది వైరస్‌కు బలవగా, 2802 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Coronavirus

దేశంలో గడిచిన 24గంటల్లో 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,88,118కి చేరాయి. ఇందులో 4,25,44,689 మంది కోలుకోగా, మరో 5,23,920 మంది మృతిచెందారు. ఇంకా 19,509 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 31 మంది వైరస్‌కు బలవగా, 2802 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత కొన్నిరోజులుగా భారీగా రోజువారీ కేసులు నమోదవుతుండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా పెరిగింది. మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని, మరణాల రేటు 1.22 శాతమని పేర్కొన్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,89,48,01,203 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీచేశామని, మంగళవారం ఒక్కరోజే 4,79,208 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement